చంద్రబాబు చెప్పినట్లు ఛైర్మన్‌ వ్యవహరించడం సిగ్గుచేటు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ‎ఈ రోజు బ్లాక్‌డే అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజ్యంగానికి తూట్లు పొడిచేలా టీడీపీ వ్యవహరిస్తుందని ఆరోపించారు.

Update: 2020-01-22 17:00 GMT
Botsa Satyanarayana

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ‎ఈ రోజు బ్లాక్‌డే అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజ్యంగానికి తూట్లు పొడిచేలా టీడీపీ వ్యవహరిస్తుందని ఆరోపించారు. శాసన సభలో ఆమోదించుకొని బిల్లు మండలికి వస్తే చర్చ జరపకుండా కమిటీకి పంపడం దారుణమన్నారు. ఛైర్మన్ చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆరోపించారు. విచక్షణాధికారంతో బిల్లును ఛైర్మన్ సెలెక్ట్‌ కమిటీకి పంపించామని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఛైర్మన్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు. చంద్రబాబుకు రాష్ట్రప్రయోజనాల కంటే స్వర్థప్రయోజనాలు ఎక్కువని మండిపడ్డారు. ఈ బిల్లును అడ్డుకని చంద్రబాబు చరిత్రహీనులుగా మిగిలిపోతారని బొత్స విమర్శించారు.

చట్టసభలపై టీడీపీ గౌరవం లేకుండా వ్యవహరించిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. టీడీపీ సభ్యులు బిల్లులను ఓటింగ్‌కు పెట్టకుండా ఛైర్మన్‌పై ఒత్తిడి తెచ్చారని విమర్శించారు. బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపాలంటే మోషన్‌ మూవ్‌ చేయాలని అలా చేయకుండా నేరుగా సెలెక్ట్‌ కమిటీకి ఏలా పంపిస్తారని నిలదీశారు. చంద్రబాబు కన్నుసన్నుల్లో ఛైర్మన్‌ వ్యవహరించారని ఆరోపించారు. నీతి నియమాలు చెప్పే యనమల రామకృష్ణుడు వికేంద్రీకరణ బిల్లుపై నిబంధనలు పాటించలేదని బుగ్గన మండిపడ్డారు. 

 

Tags:    

Similar News