Ambati Rayudu: వైసీపీకి క్రికెటర్‌ అంబటి రాయుడు రాజీనామా

Ambati Rayudu: రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తా

Update: 2024-01-06 05:25 GMT

Ambati Rayudu: వైసీపీకి క్రికెటర్‌ అంబటి రాయుడు రాజీనామా

Ambati Rayudu: వైసీపీకి క్రికెటర్‌ అంబటి రాయుడు రాజీనామా చేశారు. వైసీపీని వీడుతున్నట్టు అంబటి రాయుడు ట్వీట్‌ చేశారు. రాయుడు ఎందుకు హర్ట్ అయ్యారనేది చర్చనీయాంశంగా మారింది. గుంటూరు ఎంపీ సీటునే చిచ్చు పెట్టిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గుంటూరు ఎంపీ టికెట్ విషయంలో అధిష్టానం నుండి క్లారిటీ రాకపోవడంతో అంబటి రాయుడు రాజీనామా చేశారని తెలుస్తోంది. గుంటూరు కాకుండా వేరే స్థానం ఇస్తామని వైసీపీ అధిష్టానం పేర్కొన్నట్లు సమాచారం. గుంటూరు మాత్రమే కావాలని అంబటి రాయుడు పట్టు బడుతున్నట్లు తెలిసింది.


Tags:    

Similar News