అన్నవరం: పంచాయతీ ఆవరణలో ప్రభుత్వ ఆదేశముల ప్రకారము ఆయుష్ శాఖ నిర్వహిస్తున్న కరోనా వైద్య శిబిరంలో భాగముగా ప్రభుత్వ ఆయుర్వేదం వైద్యాధికారి డాక్టరు భాగ్యలక్ష్మి, డాక్టరు చంద్ర శేఖర్ కరోనా (కొవిడ్ )పై అవగాహన కలిపించి ప్రజలకు హోమియోపిల్స్ పంపిణీ చేశారు.
ఈ పిల్స్ ను 3 రోజుల పాటు 5 పిల్స్ చొప్పున వేసుకోవాలని, పరిశభ్రత పాటించాలని ఆయుర్వేదం డాక్టరు కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ ముర్తి, ఆరోగ్య సిబ్బంది పార్వతి, అంగనవాడి సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.