Guntur: వైసీపీ నేత నిర్వాకం.. రోడ్డుకు అడ్డంగా గోడ
Guntur: గ్రామంలో తన ఇంటి సమీపంలో రోడ్డుకు అడ్డుగా గోడ నిర్మాణం
Guntur: వైసీపీ నేత నిర్వాకం.. రోడ్డుకు అడ్డంగా గోడ
Guntur: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం దొప్పలపూడిలో ఓ వైసీపీ నేత నిర్వాకం ఆ గ్రామ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. గ్రామంలోని తన ఇంటి సమీపంలో రోడ్డుకు అడ్డుగా గోడ నిర్మాణం చేపట్టాడు. అయితే గ్రామంలోని గోడౌన్‌కు సంబంధించిన మెట్లు రోడ్డుపైకి వచ్చాయని.. పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆ వైసీపీ నేత తెలిపాడు. అధికారులు పట్టించుకోకపోవడంతో వారి తీరుపై నిరసనగా రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మాణం చేపట్టాడు. దీంతో వైసీపీ నాయకుడి తీరుతో గ్రామస్తులకు ఇబ్బందులు తప్పడంలేదు.