వైసీపీ కేంద్రంలోని బీజేపీ వద్ద మొకరిల్లింది

Update: 2020-02-17 11:32 GMT

కడప: ఎన్నికల సందర్భంగా 20 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న వైసీపీ మాటలు ఏమయ్యాయని నగరంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రెడ్డి తులసి రెడ్డి ప్రెస్ మీడియా సమావేశంలో అన్నారు. బీజేపీ పట్ల వైసీపీ వన్ సైడ్ లవ్ చేస్తుందని ఆరోపించారు. ఇప్పుడు వైసీపీ కేంద్రం లోని బీజేపీ వద్ద మొకరిల్లుతుందని ఎద్దేవాచేశారు.

రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా, కడప కు స్టీల్ ప్లాంట్, రాయలసీమ కు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజి కేంద్రం ఇవ్వలేదన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ తో పొత్తు కోసం వైసీపీ తహతహ లాడుతోందని విమర్శించారు. ఏన్నార్సీ బిల్లుకు కు రాజ్యసభలో మద్దతు ఇచ్చిన వైసీపీ ఇక్కడ ఏపీ లో మాత్రం బిల్లుకు వ్యతిరేకం అని డ్రామాలు ఆడుతున్నారు.

డిప్యూటీ సీఎం బిల్లు కోసం రాజీనామా చేయడానికి సిద్ధమని ఓట్ల కోసం డ్రామాలు అడుతున్నారన్నారు. కేంద్ర మంత్రి వర్గంలో చోటు కోసం వైసీపీ బీజేపీ తో సన్నిహితంగా మెలుగుతుందన్నారు. ప్రాంతీయ పార్టీలైన జనసేన, టీడీపి స్వార్థ ప్రయోజనాలే తప్ప వేరే ఏమి లేదని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవలన్న, విభజన అంశాలు నెరవేరాలన్న కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు.


Tags:    

Similar News