Guntur: ప్రభుత్వ స్థలాల అభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష

నగరంలో ప్రధాన ప్రాంతాలలో ఖాళీగా వున్న ప్రభుత్వ స్థలాలను అభివృద్ధి పరచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు.

Update: 2020-02-20 10:20 GMT

గుంటూరు: నగరంలో ప్రధాన ప్రాంతాలలో ఖాళీగా వున్న ప్రభుత్వ స్థలాలను అభివృద్ధి పరచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. కలక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో నగరంలోని వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ స్థలాల అభివృద్దిపై నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ( ఇండియా ) లిమిటెడ్ ఆధ్వర్యంలో రూపొందించిన డి పి ఆర్ లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఎన్ బి సి సి జనరల్ మేనేజర్ పి. యస్.రావు వివిధ ప్రభుత్వ స్థలాలు అభివృద్దిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

శ్రీనగర్ లో ఖాళీగా వున్న ప్రభుత్వం స్థలం, నగరంపాలెంలోని మహిళా ప్రాంగణం, ఇరిగేషన్ క్వార్టర్స్ ప్రాంత్రం, బ్రాడిపేటలోని జిల్లా జైలు ప్రాంతం, నగరపాలక సంస్థ వద్ద కూరగాయల మార్కెట్, నల్లపాడులోని ప్రభుత్వ స్థలాలలో నివాస, వాణిజ్య సముదాయాల నిర్మాణాలకు అవసరమైన ప్రతిపాదనలు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నివాస, వాణిజ్య సముదాయాల నిర్మాణాలకు అవసరమయ్యే నిధుల సమీకరణ, తదితర అంశాలపై అధికారులతోను ఎన్ బి సి సి ప్రతినిధులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్, తెనాలి సబ్ కలెక్టర్ దినేష్ కుమార్, జెడ్పి సిఇఓ చైతన్య, ఆర్.డి.ఓ భాస్కర రెడ్డి, అర్బన్ జిల్లా ఏఎస్పి సీతారామయ్య, గుంటూరు ఈస్ట్ తహసీల్దార్ శ్రీకాంత్, నగరపాలక సంస్థ సీటీ ప్లానర్ సునీత తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News