తిరుమల నడక మార్గంలోని నరసింహస్వామి గుడివద్ద భారీ నాగుపాము..

తిరుమల నడక మార్గంలోని నరసింహస్వామి గుడివద్ద భారీ నాగుపాము.. తిరుమల నడక మార్గంలోని నరసింహస్వామి గుడివద్ద భారీ నాగుపాము..

Update: 2019-10-06 05:44 GMT

శ్రీవారి బ్రహోత్సవాల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. కొందరు నడక మార్గంలో రోజూలాగే గోవింద నామస్మరణతో భక్తులు కొండపైకి వెళ్తున్నారు. అయితే ఆ మార్గంలో.. స్థానిక నరసింహస్వామి ఆలయం దగ్గర్లో ఉన్న ఓ షాపులో 7 అడుగుల భారీ నాగు పాము ప్రత్యక్షమైంది. మొదట అది పాము అనుకోలేది షాపు ఓనర్. కానీ అది కదులుతూ ఉండటాన్ని చూసి బెంబేలెత్తిపోయాడు వెంటనే భక్తులను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. పాము అనగానే సహజంగానే అందరిలోనూ ఒకింత భయం ఉంటుంది. పైగా అది అతి పెద్ద పాము కావడంతో... అది ఎటు వెళ్లిందో, ఎటు వస్తుందో అని భక్తులు ఆందోళన చెందుతున్న తరుణంలో షాపు ఓనర్..

పామును పట్టుకునేందుకు టీటీడీ అటవీ శాఖ ఉద్యోగి భాస్కర్ నాయుడుకు సమాచారం అందించాడు. ఆయన వెంటనే వచ్చి షాపులోకి వెళ్లారు. ఓ మూలన దాక్కున్న పాము తోక ఆయనకు కనిపించింది. అది నాగుపాము అని గుర్తించిన ఆయన.. అత్యంత జాగ్రత్తగా దాన్ని బయటకు తీసుకువచ్చాడు. ఈ క్రమంలో అతన్ని కాటు వేసే ప్రయత్నం కూడా చేసింది పాము. అయితే దానికి అంత ఛాన్స్ ఇవ్వలేదు భాస్కర్ నాయుడు. కొంతసమయానికి ఆ పామును అడవిలో వదిలేసే వచ్చాడు. భక్తులు ఎవరూ ఆందోళన చెందకుండా కొండకు చేరుకోవాలని సూచించాడు. కాగా భాస్కర్ నాయుడు ధైర్యాన్ని పలువురు భక్తులు మెచ్చుకున్నారు. 

Tags:    

Similar News