Eluru: అమానుషం.. విద్యార్థులపై కోచింగ్ సెంటర్‌ ప్రిన్సిపల్‌ లైంగిక వేధింపులు

Eluru: కోచింగ్ సెంటర్ ముందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

Update: 2023-10-02 05:18 GMT

Eluru: అమానుషం.. విద్యార్థులపై కోచింగ్ సెంటర్‌ ప్రిన్సిపల్‌ లైంగిక వేధింపులు 

Eluru: ఏలూరు జిల్లా చింతలపూడిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. చింతలపూడి ఆర్కే స్టడీ సర్కిల్‌లో నవోదయ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులపై కోచింగ్ సెంటర్ ప్రిన్సిపల్ రవికిరణ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. రాత్రి పది దాటిన తర్వాత లైంగికంగా వేధిస్తున్నాడని విద్యార్థులు ఆరోపించారు. పలువురు విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటపడింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్కే స్టడీ సర్కిల్ ముందు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ రవి కిరణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News