గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం నెరవేరింది : సీఎం జగన్‌

గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం నెరవేరింది : సీఎం జగన్‌ గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం నెరవేరింది : సీఎం జగన్‌

Update: 2019-10-02 07:44 GMT

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ/ వార్డు సచివాలయ వ్యవస్థ కొలువు తీరింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తూర్పుగోదావరి జిల్లా కరప గ్రామంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో 11,158 గ్రామ సచివాలయాలు 3,786 వార్డు సచివాలయాలు ఇవాళ్టి నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సచివాలయ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత నిర్వహించిన బహిరంగసభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.. గ్రామ సచివాలయాల ద్వారా జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం నెరవేరిందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే 1,34,978 మందికి శాశ్వత ఉద్యోగాల ఇచ్చామని.. ఇది దేశచరిత్రలోనే ఒక రికార్డ్ అని అన్నారు. సచివాలయ ఉద్యోగులందరికీ స్మార్ట్‌ఫోన్‌లు అందిస్తామని సీఎం ప్రకటించారు. ఇకపై గ్రామల్లోనే 500కుపైగా ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రానున్నాయని చెప్పిన సీఎం.. వచ్చే ఏడాదిజనవరి 1 నాటికి గ్రామ సచివాలయాల్లో పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు. అవినీతికి ఆస్కారం లేకుండా సచివాలయ ఉద్యోగులు పని చెయ్యాలని కోరారు.

Tags:    

Similar News