నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌ నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

Update: 2019-10-09 06:41 GMT

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ ఇంచార్జ్ శివరామ సబ్రహ్మణ్యం కుమార్తె అమృతవల్లి, శ్రీరంగనాథ్‌ల వివాహం రాజమండ్రిలో ఘనంగా జరిగింది. రాజమండ్రి మంజీరా ఫంక్షన్‌ హాల్లో జరిగిన ఈ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తోపాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్ నూతన హాజరై నూతన వధూవరులను ఆశీ​ర్వదించారు.

ఈ కార్యక్రమానికి మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, విశ్వరూప్‌, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ భరత్‌, కాపు కార్పోరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా తదితరులు హాజరయ్యారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ హోంమంత్రి మేకతోటి సుచరిత కుమార్తె వివాహం తణుకులో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ వివాహ వేడుకకు కూడా పలువురు వైసీపీ అగ్రనాయకులు హాజరయ్యారు. రాజకీయ ప్రముఖులతో తణుకులో సందడి వాతావరణం నెలకొంది.   

Tags:    

Similar News