రేపు విజయనగరం జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్‌

Jagan: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో కలిసి.. గిరిజన యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్

Update: 2023-08-24 07:28 GMT

రేపు విజయనగరం జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్‌

Jagan: రేపు విజయనగరం జిల్లాలో సీఎం జగన్‌తో పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటించనున్నారు. కేంద్ర ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన గిరిజన యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మరడాం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొననున్నారు. కార్యక్రమానికి సంబంధించిన పనులను డిప్యూటీ సీఎం రాజన్నదొర పరిశీలించారు. కాగా ఇప్పటికే గిరిజన యూనివర్సిటీ సంభందించిన క్లాసులు తాత్కాలిక భవనంలో కొనసాగుతున్నాయి.

యూనివర్సిటీ కోసం మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో భూసేకరణ జరిగినట్టు అధికారులు వెల్లడించారు. మౌలిక వ‌స‌తులు, న‌ష్ట ప‌రిహారం చెల్లింపు, ఇత‌ర అవ‌సరాల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 58.49 కోట్ల వ‌ర‌కు వెచ్చిస్తుందని డిప్యూటీ సీఎం రాజన్నదొర తెలిపారు.

Tags:    

Similar News