YS Jagan: మే3న విజయనగరం జిల్లాలో సీఎం జగన్ పర్యటన

YS Jagan: భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపనల్లో పాల్గొననున్నజగన్

Update: 2023-04-30 09:00 GMT

YS Jagan: మే3న విజయనగరం జిల్లాలో సీఎం జగన్ పర్యటన

YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ మే3న విజయనగరం జిల్లా లో పర్యటించనున్నారు. వైసీపీ నేతలు ముఖ్యమంత్రి పర్యటనను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మే 3వ తేదీన భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కు శంకుస్థాపనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి శంకుస్థాపనతోపాటు మత్స్యకారుల కోసం ఫిష్ లాండింగ్ సెంటర్ ను, జిల్లాలో సాగు తాగు నీటి అవసరాలను తీర్చే తారకరామ తీర్థసాగర్ పనులను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే శంకుస్థాపనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు జిల్లా అధికారులు. సీఎం పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేసేందుకు వైసీపీ నేతలు కృషి చేస్తున్నారు. సీఎం జగన్ సుదీర్ఘ కాలం తరువాత జిల్లా పర్యటిస్తున్న నేపథ్యంలో పబ్లిక్ మీటింగ్ కు భారీగా జనసేకరణతో పాటు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 

Tags:    

Similar News