CM Jagan Video Conference: వరద బాధితులకు సాయం ప్రకటించిన సీఎం జగన్‌

Update: 2020-08-18 08:31 GMT

CM Jagan Video Conference: గోదావరి వరద పరిస్థితులపై ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వరద పరిస్థితులపై కలెక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అధికారులంతా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, తాను ఏరియల్‌ సర్వేకు వెళ్తున్నానని జగన్ వారికి తెలిపారు. ముంపు బాధితుల కుటుంబాలకు రూ.2 వేల చొప్పున సహాయం అందించాలని చెప్పారు. బాధితుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలన్నారు.

సహాయక చర్యల్లో ఖర్చు విషయంలో వెనుకాడొద్దని చెప్పారు. వచ్చే మూడ్రోజుల్లో గోదావరి వరద క్రమంగా తగ్గుతుందన్న సీఎం ఆ తర్వాత 10 రోజుల్లోనే పంట నష్టం అంచనాలు పంపించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌, సమాచార వ్యవస్థలను త్వరగా పునరుద్ధరించాలని సూచించారు. సహాయక చర్యల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News