Cm Jagan Help To Pawan Kalyan Fan : పవన్‌ అభిమానికి సీఎం జగన్‌ సాయం!

Cm Jagan Help To Pawan Kalyan Fan : పవన్‌ అభిమానికి సీఎం జగన్‌ సాయం!
x
Cm Jagan Help To Pawan Kalyan Fan For Health Operation
Highlights

Cm Jagan Help To Pawan Kalyan Fan : హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆర్ధిక

Cm Jagan Help To Pawan Kalyan Fan : హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆర్ధిక సహాయం చేశారు. పవన్ అభిమాని అయిన నాగేంద్ర రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని, అతనికి అత్యవసర చికిత్స చేయాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అయితే ఈ వార్తపై పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు స్పందించారు.

దీనిని వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా సీఎం జగన్ దీనిపైన స్పందించి పవన్ కళ్యాణ్ అభిమానికి రూ.10లక్షలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎంవో స్పెషల్ ఆఫీసర్‌ డాక్టర్ హరికృష్ణ ఆస్పత్రికి ఎల్‌వోసీ అందజేశారు. ప్రభుత్వ సాయంతో నాగేంద్రకు చికిత్స జరిగింది. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇక దీనిపైన సినీ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూడా ఈ ట్వీట్ పై స్పందించారు. గూగుల్ పే నెంబర్ ఇవ్వాలని ట్వీట్ చేశారు.



Show Full Article
Print Article
Next Story
More Stories