ఈ నెల 24న సీపెట్‌ భవనాలను ప్రారంభించనున్న సీఎం

Update: 2019-10-21 12:49 GMT

ఈ నెల 24న కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. గన్నవరం మండలం సూరంపల్లిలో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించిన సీపెట్‌ భవనాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నట్టు సమాచారం. ఈ కార్యక్రమానికి కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి డివి సదానందగౌడ కూడా హాజరుకానున్నట్టు తెలుస్తోంది. దీంతో సీఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు అధికారులు. ఇప్పటికే సీఎం ప్రొగాం కో​‍ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ మాధవిలత, నూజివీడు సబ్‌ కలెక్టర్‌ స్వీప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, వైఎస్సార్‌సీపీ గన్నవరం ఇంఛార్జి యార్లగడ్డ వెంకట్రావు స్థలాన్ని పరిశీలించారు.

కాగా ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్నారు. సీఎం సోమవారం రాత్రికి ఢిల్లీలోనే బసచేస్తారు. 22వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి నేరుగా విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. అనంతరం రేపు రాత్రి 9 గంటల ప్రాంతంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 

Tags:    

Similar News