Chandrababu: దసరా రోజున వాహన మిత్ర పథకం ప్రారంభిస్తాం
Chandrababu: కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమం సూపర్ హిట్ అన్నారు సీఎం చంద్రబాబు.
Chandrababu: కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమం సూపర్ హిట్ అన్నారు సీఎం చంద్రబాబు. ఏపీని అన్నింటా సూపర్ హిట్ చేద్దామని, దేశంలో నంబర్ వన్ చెద్దామని పిలుపునిచ్చారు. ప్రజా దీవెనలతో టీడీపీ, జనసేన, బీజేపీ కాంబినేషన్ కొనసాగుతోందన్నారు సీఎం చంద్రబాబు.
అనంతపురం నుంచి జగన్‌కు సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. దమ్మంటే అసెంబ్లీ రావాలని అన్ని విషయాలు చర్చిద్దామని అన్నారు. అసెంబ్లీకి రాకుండా బయట రప్పా..రప్పా అంటున్నారన్నారు. ఇక్కడున్నది చంద్రబాబు, పవన్ కల్యాణనని..ఆడబిడ్డలను అవమానిస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
దసరా నుంచి కేంద్రం జీఎస్టీ తగ్గిస్తోందన్నారు సీఎం చంద్రబాబు. అనేక రకాల వస్తువుల రేట్లు తగ్గబోతున్నాయని తెలిపారు. దీనితో పేదల ఖర్చు తగ్గించి...ఆదాయం పెంచేలా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభలో వెల్లడించారు.
ఏపీలో దసరా రోజున వాహన మిత్ర పథకం ప్రారంభించి...ఒక్కో ఆటో డ్రైవర్‌కు 15వేల చొప్పున ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సూపర్ సిక్స్ - సూపర్ హిట్ పేరిట నిర్వహించి బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లకు దసరా కానుక ప్రకటించారు.