CM Chandrababu: ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం.. విద్యుత్ ఛార్జీలను పెంచడం లేదు

CM Chandrababu: తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు.

Update: 2025-12-03 11:37 GMT

CM Chandrababu: ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం.. విద్యుత్ ఛార్జీలను పెంచడం లేదు

CM Chandrababu: తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో భాగంగా రైతులు, రైతు కుటుంబాలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. రైతుల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని తెలిపారు.

రైతన్నకు అండగా ఉంటామనేది తమ మొదటి నినాదమని ఆయన స్పష్టం చేశారు. నీటి వనరులు పెంచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. విద్యుత్‌ ఛార్జీలను పెంచడం లేదని మరోసారి స్పష‌్టం చేశారు. ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Tags:    

Similar News