మరో కేసులో చింతమనేని అరెస్టు
దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు మరో షాక్ తగిలింది. తాజాగా మరో కేసులో రిమాండ్ విధించింది కోర్టు. పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన చెరుకు జోసెఫ్‌ను ఈ ఏడాది ఆగస్టు 28న చింతమనేని
దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు మరో షాక్ తగిలింది. తాజాగా మరో కేసులో రిమాండ్ విధించింది కోర్టు. పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన చెరుకు జోసెఫ్‌ను ఈ ఏడాది ఆగస్టు 28న చింతమనేని ప్రభాకర్,అతని అనుచరులు దాడి చేసి, కులం పేరుతో దూషించారని కేసు నమోదైంది. అయితే ఈ కేసును ఉపసహరించుకోవాలని, లేదంటే కుటుంబ సభ్యుల అంతు చూస్తామని చింతమనేని ప్రభాకర్, మరి కొంతమంది బెదిరించినట్టు ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో మరోసారి జోసెఫ్ ఫిర్యాదు చేశాడు.
ఈ కేసు విచారణలో భాగంగా చింతమనేనిని పీటీ వారెంట్‌పై జిల్లా జైలు నుంచి ఏలూరులోని సెకండ్ ఏజెఎఫ్‌సీఎం కోర్టుకు తీసుకువచ్చి హాజరుపరిచారు. న్యాయమూర్తి ఈనెల 28వ తేదీ వరకు రిమాండ్ విధించారు. ఈ ఏడాది సెప్టెంబరు 11వ తేదీన ఒక ఎస్‌ఐ ఎస్సీ, ఎస్టీ కేసులో అరెస్టయిన చింతమనేని.. ప్రస్తుతం ఏలూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికి 13 కేసుల్లో పోలీసులు పీటి వారెంట్‌పై అరెస్టు చూపించారు.