చంద్రబాబుతో చినరాజప్ప ములాఖత్
Chinarajappa: చంద్రబాబు ధైర్యంగా ఉన్నారన్న చినరాజప్ప
చంద్రబాబుతో చినరాజప్ప ములాఖత్
Chinarajappa: టీడీపీ కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలని చంద్రబాబు చెప్పారని, మాజీ మంత్రి చినరాజప్ప తెలిపారు. రాజమండ్రి జైలులో చంద్రబాబుతో ములాఖత్ అయిన చిన రాజప్ప ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చంద్రబాబు చెప్పారన్నారు. అరాచక పాలనపై పోరాడాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారని తెలిపారు. త్వరలోనే జనసేనతోనే టీడీపీ కార్యాచరణ ఉంటుందని చంద్రబాబు చెప్పారని చినరాజప్ప తెలిపారు.