Nagababu: ఏపీ కేబినెట్‎లోకి నాగబాబు..ఏ శాఖ కేటాయిస్తున్నారో తెలుసా?

Update: 2024-12-10 00:40 GMT

 Nagababu: ఏపీ ఉప ముఖ్యమంత్రి , జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబును ఏపీ కెబినేట్ లోకి తీసుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. జనసేనలో ప్రధాన కార్యదర్శిగా యాక్టివ్ గా ఉంటున్న నాగబాబుకు మంత్రి పదవి కేటాయించేందుకు కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుందని సీఎం చంద్రబాబు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీంతోపాటు టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుల పేర్లను కూడా ముఖ్యమంత్రి వెల్లడించారు.

అయితే నాగబాబుకు ఏ శాఖను కేటాయిస్తున్నారన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ కోరికతోపాటు, జనసేనపార్టీకి నాగబాబు అందించిన సేవలకు గాను ఆయనను కేబినెట్ లోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో మంత్రివర్గంలో జనసేన బలం మరింత పెరిగినట్లయివుతుంది.

ఏపీ అసెంబ్లీ రూల్స్ అనుసరిస్తూ మొత్తం 25 మంత్రి పదవులు ఉండాల్సి ఉంటే..ప్రస్తుతం మంత్రివర్గంలో 24 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన ఒక స్థానం జనసేనకు కేటాయించేశారు. ఈ నేపథ్యంలో జనసేన తరపున నాగబాబును మంత్రిగా ఖరారుచ చేస్తూ సీఎం ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే ప్రస్తుతం జనసేన నుంచి పవన్ కల్యాణ్, కందుల దుర్గేశ్ , నాదెండ్ల మనోహర్ మాత్రమే కేబినెట్ లో ఉన్నారు. కూటమి పొత్తు ఒప్పందం ప్రకారం జనసేనకు నాలుగు మంత్రి పదవులు, బీజేపీకి 1 కేటాయించాల్సి ఉంది. దీనిలో భాగంగా ఈ ఖాళీని నాగబాబుతో భర్తీ చేయనున్నారు. రాజ్యసభ స్థానాల విషయానికొస్తే కూటమి ప్రభుత్వం బీద మస్తాన్, సానా సతీఫ్ పేర్లను ఖారారు చేసింది.



Tags:    

Similar News