ఒక వ్యక్తి రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్నారు

అమరావతే రాజధానిగా కొనసాగుతుందని సీఎం ప్రకటించే వరకు తన పోరాటం కొనసాగుతుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు.

Update: 2020-01-12 17:30 GMT

అమరావతే రాజధానిగా కొనసాగుతుందని సీఎం ప్రకటించే వరకు తన పోరాటం కొనసాగుతుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో అమరావతి పరిరక్షణ సమితి నేతృత్వంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. అనంతరం జేఏసీ నేతలు జోలె పట్టి విరాళాల సేకరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.. ఈ ఉద్యమం ఒక పార్టీకి చెందింతో, వ్యక్తులకు చెందిందో కాదు ప్రజలది. వైసీపీ తప్ప అన్ని పార్టీలకూ ఇందులో భాగస్వామ్యం ఉందని చంద్రబాబు చెప్పారు. జై అమరావతి అనేది ప్రజల నినాదం కావాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా సీఎంపై పరోక్షంగా విమర్శలు చేశారు. రాష్ట్రానికి ఒక వ్యక్తి చాలా నష్టం కలిగిస్తున్నారని చెప్పారు. రాజధాని అమరావతి కొనసాగించాలంటూ ఎందరో సొంతపనులు మానుకొని పోరాడుతున్నారని తెలిపారు. పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ ఆదేశించారని మహిళలని తెలిసి కూడా కొడతారా అని ప్రశ్నించారు. డీజీపీని ఉద్ధేశించి మిస్టర్ డీజీపీ మీకు భయపడేవాళ్లు లేరు మీకు భయపడి ఉధ్యమం ఆగదని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ కి మధ్యలో ‎అమరావతి ప్రాంతం ఉందని. 13 జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది‎ని తెలిపారు. విశాఖకు ఎన్నో సంస్థలు తీసుకురావాలని అనుకున్నామని, వైసీపీ అధికారంలోకి వచ్చి అన్నిటిని రద్దు చేసిందని తెలిపారు. విశాఖ ప్రజలు రాజధాని కావాలని ఎప్పుడూ అడగలేదు. విశాఖకు డేటా సెంటర్‌ తెస్తే 70వేల మందికి ఉద్యోగాలు వచ్చేవని చంద్రబాబు అన్నారు. తానేప్పుడూ తప్పు చేయలేదని, అమరావతిలో ఉన్న లోపం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

 

Tags:    

Similar News