ఐదు నెలల్లోనే ఇన్ని అరాచకాలు.. అక్రమాలా : చంద్రబాబు నిప్పులు

ఐదు నెలల్లోనే ఇన్ని అరాచకాలు.. అక్రమాలా : చంద్రబాబు నిప్పులు

Update: 2019-10-18 07:32 GMT

వైసీపీ పాలనపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు.. శుక్రవారం గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం జగన్ కేవలం ఐదునెలల కాలంలోనే లెక్కలేనన్ని అరాచకాలు, అక్రమాలు చేశారని దుమ్మెత్తిపోశారు. ప్రజలు వైసీపీకి ఎందుకు ఓటేశామా? అని మధన పడిపోతున్నారని చంద్రబాబునాయుడు విమర్శించారు. సచివాలయ ఉద్యోగాల్లో ప్రశ్నాపత్రాన్ని టైప్ చేసిన వారికే మొదటి ర్యాంక్ వచ్చిందని ఇది కుంభకోణం కాదా అని ప్రశ్నించారు. 

ఇసుక కొరతతో 30 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్న చంద్రబాబు.. ఇసుక సరఫరా విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. విద్యుత్ కోతలు ఎండాకాలమే వస్తాయనుకుంటే ఏపీలో మాత్రం వర్షాకాలంలో కూడా విద్యుత్ కోతలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. మద్యంపై జే-ట్యాక్స్ వసూలు చేస్తూ పేదలను పీల్చి పిప్పి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వంలోని లొసుగులను ఎత్తి చూపే పత్రికలపై కక్ష పూరితంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ.. ఈ సందర్బంగా ఓ విలేకరిని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బెదిరిస్తున్నారన్న ఆడియోను ప్రదర్శించారు. 

Tags:    

Similar News