అసెంబ్లీని ముట్టడిస్తాం..భీమవరంలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Update: 2020-01-18 14:54 GMT
చంద్రబాబునాయుడు (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిని సీఎం వైఎస్ జగన్‌ ధ్వంసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రాజధాని అమరావతిని తరలిస్తే ప్రజలు వైసీపీని బంగాళాఖాతంలో కలుపుతారని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జేఏసీ ఆద్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పిలిస్తే రాజధాని రైతులు వేల ఎకరాలు ఇచ్చారని, రాజధాని కోసం భూము ఇచ్చిన రైతులను సీఎం వెన్నుపోటు పొడుస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

రాజధాని రైతులకు మాత్రమే సంబంధించింది అంశం కాదని, రాష్ట్ర ప్రజల భవిష్యత్‌కు సంబంధించిన అంశమని అన్నారు. రాజధాని అమరావతిని తరలించవద్దని 32 రోజులుగా రైతులు రోడ్లపైకి వచ్చి ఉద్యమం చెస్తున్నారని తెలిపారు. మహిళలపై దాడికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. మహిళలపై దాడులు చేస్తూ సీఎం పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని విమర్శించారు. అధికారంలో ఉంటే అభివృద్ధి చేయాలని సూచించారు. సీఎం ఆనందం కోసం పోలీసులను బలిపశులుగా మారారని తెలిపారు. మద్రాస్‌ ఐఐటీ నివేదిక ఇవ్వలేదని రుజువైందని ఆయన అన్నారు. ఈ నెల 20న అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి చేపడుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు ఉన్నాయని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సభలు సమావేశాలకు అనుమతులు ఇచ్చామని చంద్రబాబు అన్నారు. అమరావతి రైతులను మోసం వారు విశాఖ వాసులను మోసం చేయరని నమ్మకం ఎంటని ప్రశ్నించారు.విశాఖలో భూములపై వైసీపీ నాయకుల కన్నుపడిందని అందుకే విశాఖపై ఇప్పటికిప్పుడు ప్రేమ పుట్టుకొచ్చిందని ఆరోపించారు. విశాఖలో భూములు దోచుకునేదుకే వైసీపీ రాజధాని తరలింపు చేపట్టిందని ఆరోపించారు. అమరావతిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. 

  

Tags:    

Similar News