Chandrababu Naidu: నాపై 24 క్లైమోర్ మైన్స్‌తో దాడి చేశారు - చంద్రబాబు
Chandrababu Naidu: వైసీపీ హయాంలో అన్నివిధాల వెనుకబడిన రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
Chandrababu Naidu
Chandrababu Naidu speech in AP assembly sessions: వైసీపీ హయాంలో అన్నివిధాల వెనుకబడిన రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఏర్పాటైన 150 రోజుల్లో చేసిన పనులను వివరించారు. ప్రస్తుతం ఒక్కో ఇటుక పేరుస్తూ రాష్ట్రాన్ని పునర్నిస్తున్నామని చెప్పారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం గొప్ప అవకాశంగా భావిస్తున్నానని తెలిపారు. ఇది ప్రజలు తనపై విశ్వాసంతో ఇచ్చిన అవకాశంగా అభివర్ణించారు.
24 క్లైమోర్ మైన్స్‌తో బాంబులు పేల్చినప్పటికీ, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో మళ్లీ బతికొచ్చానన్నారు. నాలుగు దశాబ్ధాలుగా ప్రజా జీవితంలో ఉండే అవకాశం వారు నాకు ఇచ్చారన్నారు. 2003 నాటి అలిపిరి ఎటాక్ ఘటనను గుర్తుచేసుకుంటూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.