ఒక్క నాయకుడు వెళితే వందమందిని తయారు చేసుకుంటాం

-జగన్ లాంటి కుటిల రాజకీయ నేతలను చాలామందిని చూశా -ఇద్దరు నేతలను తీసుకుని నాపై విమర్శలు చేయిస్తున్నారు -ఇసుక కొరత సహజంగా వచ్చింది కాదు.. కృత్రిమంగా సృష్టించిందే

Update: 2019-11-14 14:43 GMT

జగన్ లాంటి కుటిల రాజకీయ నేతలను చాలామందిని చూశానని అన్నారు చంద్రబాబునాయుడు. ఒక్క నాయకుడు వెళితే వందమందిని తయారు చేసుకుంటామన్నారు. ఇద్దరు నేతలను తీసుకుని నాపై విమర్శలు చేయిస్తున్నారని చెప్పారు. ఇలాంటి కుయుక్తులు నావద్ద సాగవని జగన్ గ్రహించాలన్నారు. 

ఇసుక కొరత సహజంగా వచ్చిందని కాదని కృత్రిమంగా సృష్టించేందేనని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇవాళ ఇసుక కావాలంటే ప్రభుత్వ దయాదాక్షిణ్యాలు కావాలన్నారు.కార్మికులు కాలం తీరి చనిపోయారని ఓ మంత్రి మాట్లాడటం దారుణమన్నారు. పేదవాళ్ల బతుకులు మీకు తమాషాగా కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. 

Tags:    

Similar News