Chandrababu: గుంటూరు ఘటన కలిచివేసింది
Chandrababu: గుంటూరు ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి
Chandrababu: గుంటూరు ఘటన కలిచివేసింది
Chandrababu: గుంటూరు ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేదలకు సాయం అందించే మంచి కార్యక్రమంలో విషాదం జరగడం విచారకరమన్నారు. గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ చేపట్టిన పేదలకు కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయిన ఘటన తనను కలిచివేసిందన్నారు. పేదలకు కానుకలు ఇచ్చేందుకు ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నానని చంద్రబాబు చెప్పారు. కార్యక్రమం ముగిసిన తర్వాత నేను వెళ్లిన అనంతరం జరిగిన ఘటనలో ముగ్గురు చనిపోవడం బాధాకరం అని తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. పేదలకు ఆ స్వచ్ఛంద సంస్థ చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించాలి అనే ఆలోచనతో కార్యక్రమానికి వెళ్లినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. పేదల కుటుంబాల్లో జరిగిన ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందని.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు చంద్రబాబు.