Chandrababu: వ్యక్తులపై కక్షతో జగన్ వ్యవస్థలను నాశనం చేస్తున్నారు

Chandrababu: పవర్‌లో ఉన్నవారు వ్యక్తులపై కక్షతో వ్యవస్థలను నాశనం చేయకూడదు

Update: 2022-10-10 07:00 GMT

Chandrababu: వ్యక్తులపై కక్షతో జగన్ వ్యవస్థలను నాశనం చేస్తున్నారు

Chandrababu: ఏపీ జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. వ్యక్తులపై కక్షతో జగన్ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలోని SRM విశ్వవిద్యాలయంలో భవనాలు, సదుపాయాలు, పరిశోధన కార్యక్రమాలు, బోధనా సిబ్బంది సహా అన్నీ ఉన్నా.. ఇక్కడికి చేరుకునేందుకు సరైన రోడ్లు లేవని వర్సిటీ వ్యవస్థాక కులపతి డాక్టర్ టీఆర్ పారవేందర్ ఆవేదన వ్యక్తం చేసిన న్యూస్ క్లిప్‌ను షేర్ చేసిన చంద్రబాబు.. ఈ మేరకు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నవారు వ్యక్తులపై కక్షతో వ్యవస్థలను నాశనం చేయడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో జగన్ మొదటి నుంచి ఇదే చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతికి ప్రతిష్ఠాత్మకమైన VIT, SRM వంటి విద్యా సంస్థలు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారని పేర్కొన్నారు. అలాంటి సంస్థలు రాజధానిలో ఉండకూడదని కనీసం రోడ్ల సదుపాయం కల్పించకపోవడం, మరమ్మతులు చేయకపోవడం దారుణమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News