Polavaram Project: పోలవరం రూ.30,436 కోట్ల సవరణ అంచనాలకు కేంద్రం ఆమోదం

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు సవరించిన వ్యయం రూ.30, 436. 95 కోట్లకు కేంద్రం ఆమోదం తెలిపింది.

Update: 2025-02-01 08:04 GMT

Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు రూ.30,436 కోట్ల సవరణ అంచనాలకు కేంద్రం ఆమోదం

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు సవరించిన వ్యయం రూ.30, 436. 95 కోట్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2025-26 బడ్జెట్ ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ లో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పోలవరం బ్యాలెన్స్ గ్రాంట్ రూ. 12, 157. 53 కోట్లుగా కేంద్రం తెలిపింది. 2025-26 బడ్జెట్ లో రూ. 12,157.53 కోట్లను కేంద్రం కేటాయించింది. గత ఏడాది బడ్జెట్ లో కూడా పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టును2028 నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. గత బడ్జెట్ లో అమరావతిలో రాజధాని నిర్మాణ పనులకు రూ. 15 వేల కోట్లు కేటాయించారు. ఈ నిధులను అప్పుల రూపంలో ఇప్పించనుంది కేంద్రం. ఈ రుణాలు ఇచ్చే సంస్థలకు కేంద్రం గ్యారంటీ ఇస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పోలవరం, అమరావతిలో రాజధాని నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్రం తీసుకొంది. ఇప్పటివరకు ప్రాజెక్టు కోసం చేసిన ఖర్చుకు సంబంధించిన నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. దావోస్ నుంచి తిరిగి వచ్చిన సమయంలో రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ లో కేటాయింపుల గురించి చంద్రబాబు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చర్చించారు.

Tags:    

Similar News