TTD: టీటీడీ లేఖపై స్పందించిన కేంద్ర పురావస్తు శాఖ

TTD: మండపాలను పరిశీలించి టీటీడీకి సూచనలు చేయనున్న కమిటీ

Update: 2024-01-11 08:25 GMT

TTD: టీటీడీ లేఖపై స్పందించిన కేంద్ర పురావస్తు శాఖ

TTD: టీటీడీ లేఖలపై కేంద్ర పురావస్తు శాఖ స్పందించింది. అలిపిరి వద్ద పాదాల మండపం, పుష్కరిణిలో అహ్నిక మండపం.. శిథిలావస్థకు చేరడంతో పునఃనిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. పురాతన మండపాలు కావడంతో పురావస్తుశాఖ దృష్టికి టీటీడీ తీసుకువెళ్లింది. మండపాలను పునఃనిర్మాణానికి సూచనలు చేసేందుకు.. కేంద్ర పురావస్తుశాఖ కమిటీని ఏర్పాటు చేసింది. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుకు చెందిన అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. మండపాలను పరిశీలించి టీటీడీకి సూచనలు కమిటీ సూచనలు చేయనుంది.

Tags:    

Similar News