నేటి నుంచి ఏపీలో సీఈసీ బృందం పర్యటన

CEC: నేడు, రేపు సార్వత్రిక ఎన్నికలపై కీలక సమావేశాలు

Update: 2024-01-09 03:30 GMT

నేటి నుంచి ఏపీలో సీఈసీ బృందం పర్యటన

CEC: రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణ, సన్నద్ధత వంటి అంశాలను పరిశీలించి తగు సూచనలు ఇవ్వడానికి కేంద్ర ఎన్నికల సంఘం బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్, కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్‌ గోయల్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం సమీక్షించడానికి విజయవాడ చేరుకున్నారు.

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఆయా జిల్లాలకు సంబంధించి ఎస్‌ఎస్‌ఆర్‌–2024 కార్యకలాపాలు, ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను సమీక్షించనున్నారు. ఓటర్ల జాబితాలో ఎటువంటి గందరగోళం లేకుండా పారదర్శకంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన 5.64 లక్షల పేర్లను అనర్హులుగా తేల్చినట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత కోసం తీసుకున్న చర్యలను స్టేట్‌ పోలీస్‌ నోడల్‌ ఆఫీసర్‌తో కలిసి కేంద్ర ఎన్నికల అధికారులకు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించనున్నారు. అనంతరం.. కేంద్ర, రాష్ట్రాలకు చెందిన వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలకు చెందిన అధికారులతో సమావేశం ఉండనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశంకానున్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ నేతృత్వంలోని బృందం గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. రానున్న సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై విజయవాడలో జరగనున్న సమీక్ష సమావేశాల నిమిత్తం రాజీవ్‌కుమార్‌తో పాటు ఎలక్షన్‌ కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్‌ గోయల్‌ ఢిల్లీ నుండి ఇక్కడికి చేరుకున్నారు.

Tags:    

Similar News