Margani Bharat: ఎంపీ మార్గాని భరత్‌పై కేసు నమోదు

Margani Bharat: తన తండ్రికి యాక్సిడెంట్ చేసి వెళ్లిపోయారని ఫిర్యాదు చేసిన కిరణ్ బాబు

Update: 2023-05-18 06:48 GMT

Margani Bharat: ఎంపీ మార్గాని భరత్‌పై కేసు నమోదు 

Margani Bharat: రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌పై దెందులూరు పోలీస్ స్టేషన్‌లో రిటైర్డ్ పశువుల డాక్టర్ నర్సయ్య కుమారుడు ఫిర్యాదు చేశారు. ఎంపీ మార్గాని భరత్ కారు ఢీ కొట్టడంతో తన తండ్రి డాక్టర్ నర్సయ్య చనిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రమాదం జరిగినప్పుడు మార్గాని భరత్ కారులోనే ఉన్నారని... ప్రమాదం చేసి కూడా చావుబతుకుల్లో ఉన్న వ్యక్తిని నడిరోడ్డుపై విడిచిపెట్టి సీఎంని కలిసేందుకు వెళ్లారని నర్సయ్య కొడుకు కిరణ్ బాబు ఆరోపిస్తున్నాడు. గతంలో తన తల్లి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేని బాధితుడు ఆరోపిస్తున్నాడు.

Tags:    

Similar News