ముగిసిన హైపవర్ కమిటీ భేటీ.. ప్రాంతాల వారీగా అభివృద్ధిపై చర్చ

Update: 2020-01-07 16:35 GMT
బుగ్గన రాజేంద్రనాథ్

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వికేంద్రీకరణ, అభివృద్ధిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ సమావేశం ముంగిసింది. ఈ హై పవర్‌ కమిటీ నివేదికలో అధికార వికేంద్రీకరణ జరగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ , బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, ఐటీ శాఖమంత్రి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు.

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమావేశం అనంతరం మాట్లాడారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై మూడు సూదీర్ఘ చర్చ నడిచినట్లు తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని హైపవర్ కమిటీ భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమై ఉండకూడదని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల ప్రతిపాదనలకు సానుకూలంగా ఉన్నట్లు పరోక్షసంకేతాలు ఇచ్చారు. మరో రెండు మూడు రోజుల్లో సమావేశం కానున్నట్లు తెలిపారు. జీఎన్ రావు, బీసీజీ నివేదికలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నేతృత్వంలో ఆర్టీసీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఈ భేటీ జరిగింది. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, జీఎన్‌ రావు కూడా హాజరయ్యారు.

బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇచ్చిన నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. రాజధాని విషయంలో రెండు ఆప్షన్ కేటాయించింది. ఆప్షన్-1 కింద గవర్నర్, సీఎం కార్యాలయాలు, అలాగే సచివాలయం విశాఖలో ఏర్పాటు చేయాలని అత్యవసర సమావేశాలు కూడా విశాఖలో ఏర్పాటు చేయాలని సూచించింది. అమరావతిలో హైకోర్టు బెంచ్, వ్యవసాయ, ఎడ్యూకేషన్ హబ్ , శాసనసభ, కర్నూలులో హైకోర్టు, పలు శాఖధిపతి కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.

అప్షన్-2 ఆప్షన్-2 కూడా తెలిపింది. విశాఖలో సెక్రటరియేట్, ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వ శాఖలు, అత్యవసర సమావేశాలు కోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, ఏర్పాటుచేయాలని, కర్నూలులో హైకోర్టు, రాష్ట్ర కమిషనర్ కార్యాలయం, అప్పిలేట్ సంస్ఠలు ఏర్పాటు చేయాలి తెలిసింది.

జీఎస్‌రావు కమిటీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి తుది నివేదిక అందజేసింది. సచివాలయంలో సీఎం జగన్‌తో సమావేశమైన జీఎస్‌‌రావు కమిటీ సభ్యులు నివేదికను సమర్పించి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించిన జీఎస్‌రావు కమిటీ సభ్యులు ప్రజల నుంచి సూచనలను సలహాలు అభిప్రాయాలను సేకరించారు. విశాఖ, కర్నూలు, అమరావతితోపాటు ఇతర ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించి ఏది ఎక్కడ అనువుగా ఉంటుందనే కోణంలో అధ్యయనం చేశారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా తమకు అందిన 40వేలకు పైగా వినతులను కమిటీ పరిశీలించింది. పలు అంశాలపై నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News