Andhra Pradesh: ప్రజారోగ్య పరిరక్షణకు నిధుల కేటాయింపు నిలిపివేత

Andhra Pradesh: మున్సిపాల్టీలలో ప్రజల నుంచి వసూలు చేయనున్న... * పారిశుధ్య పనులకు అవసరమైన నిధులు

Update: 2021-06-28 07:04 GMT
వ్యర్థాలు తరలించే వాహనం(ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఒకప్పుడు చెత్త నుంచి సంపద సృష్టించ వచ్చన్నారు.. తడిపొడి చెత్త ఇస్తే పట్టణ ప్రజలకు నగదు ప్రోత్సాహకాలు ఇచ్చారు. వేస్ట్‌ మేనేజ్‌ మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి సేకరించిన చెత్త ద్వారా నిధులు సమీకరించారు. మరిప్పుడు.. అదే చెత్త పేరుతో పన్నులు వసూలు చేస్తున్నారు.

ఏపీ మున్సిపాల్టీలలో ప్రజారోగ్య పరిరక్షణకు నిధుల కేటాయింపును ప్రభుత్వం ఇక నిలిపి వేయనుంది. పారిశుధ్య పనులకు అవసరమైన నిధులను ప్రజల నుంచి వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే చెత్తకు మునిసిపాల్టీలు పన్ను విధిస్తున్నాయి. పారిశుధ్య నూతన విధానాన్ని ప్రభుత్వం జులై నెల నుండి ప్రవేశ పెట్టనుంది. ప్రభుత్వం మారినప్పుడల్లా కొత్త విధానం అమలులోకి వస్తుంది. దీంతో కోట్లలో ప్రజాధనం వ్యర్థమౌతుంది.

లోగడ చెత్త సేకరణకు రిక్షాలను వినియోగించారు. ఆ తర్వాత ఆటోలు వాడారు. వీటిని మూలన పడేసి ట్రాక్టర్లను వినియోగించారు. ఆ తర్వాత డంపర్‌ బిన్లు ఏర్పాటు చేసి వాటిలో చెత్త నిండిన తర్వాత తరలించేందుకు వాహనాలను ఏర్పాటు చేశారు. ఇంటింటి నుంచి చెత్త సేకరణకు తోపుడు బండ్లను వాడుతున్నారు. ఇలా సేకరించిన చెత్తను కంపోస్టు యార్డులకు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. వీటితో పాటు కాంపాక్ట్‌ యంత్రాలను, డస్ట్‌బిన్లను వినియోగిస్తున్నారు. ఈ విధానాలన్నిటికి ప్రభుత్వం స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. ఈ వాహనాలు, యంత్రాల స్థానంలో కొత్తగా కోట్లు వెచ్చించి బ్యాటరీ ఆటోలను కొనుగోలు చేస్తున్నారు.

కొత్త విధానంలో ఇంటింటి నుంచి ఆటోల ద్వారా చెత్తను సేకరిస్తారు. ఈ చెత్తను కలెక్షన్‌ పాయింట్లకు తరలిస్తారు. ఒక్కొక్క కలెక్షన్‌ పాయింట్‌ నిర్మాణానికి భారీగా నిధులు ఖర్చు చేయనున్నారు. కలెక్షన్‌ పాయింట్ల నుంచి కాంపాక్ట్‌ యంత్రాల ద్వారా యార్డుకు తరలిస్తారు. ఇలా మూడంచెల విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ నూతన విధానానికి ఆర్థిక భారం ప్రజలపై పడుతుంది. ప్రజారోగ్యంలో ప్రధాన అంశమైన పారిశుధ్యం మెరుగుదలకు మునిసిపాల్టీలు నిధులు వెచ్చించకుండా ఈ భారాన్ని కూడా ప్రజలపై మోపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Full View


Tags:    

Similar News