Botsa Satyanarayana: మున్సిపల్ కార్మికుల సమ్మె విరమిస్తే నోటిఫికేషన్ ఇస్తాం
Botsa Satyanarayana: తక్షణం సమ్మె విరమించి విధుల్లో చేరితే అమలు చేస్తాం
Botsa Satyanarayana: మున్సిపల్ కార్మికుల సమ్మె విరమిస్తే నోటిఫికేషన్ ఇస్తాం
Botsa Satyanarayana: మున్సిపల్ కార్మికుల మెజార్టీ డిమాండ్లను అంగీకరించామని అన్నారు మంత్రి బొత్స. మున్సిపల్ కార్మికులకు వివిధ కేటగిరీల కింద జీతాలున్నాయని, హెల్త్ అలవెన్స్ 6 వేల వేతనంతో కలిపి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు 7 లక్షల రూపాయలు పరిహారం ఇస్తామన్నారు. మరికొన్ని డిమాండ్లకు మంత్రుల కమిటీ అంగీకారం తెలిపిందని, మున్సిపల్ కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని కోరారు. తక్షణం సమ్మె విరమించి విధుల్లో చేరితే ఈ డిమాండ్లన్నింటినీ అమలు చేస్తామన్నారు. మున్సిపల్ కార్మికులు సమ్మె విరమిస్తే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు బొత్స. అయితే.. ప్రభుత్వంతో జరిగిన చర్చలు తమకు సంతృప్తిగా లేవని, సమ్మెను యథావిధిగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు మున్సిపల్ కార్మికులు.