13 జిల్లాలను 6 ప్రాంతాలుగా విభజించి అధ్యయనం చేసింది

రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై ఏర్పాటైన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇచ్చిన నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది.

Update: 2020-01-03 15:02 GMT
Vijay kumar

రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై ఏర్పాటైన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇచ్చిన నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. విశాఖలో మాత్రమే అంతర్జాతీయ విమానాశ్రయం ఉందని పేర్కొంది. విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఏపీ ప్రణాళికా కార్యదర్శి విజయ్ కుమార్ వివరాలు వెల్లడించారు. మొత్తం 13 జిల్లాలను 6 ప్రాంతాలుగా విభజించి అధ్యయనం చేసినట్లు తెలిపారు. ఏపీకి 2.25లక్షల కోట్లు అప్పు ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ వెనుకబడి ఉంది. ప్రాంతాల వారీగా వనరులను అంచనా వేశాం. వివిధ దేశాల అభివృద్ధితో పాటు చాలా సమాచారం సేకరించామని తెలిపారు.

విశాఖ నుంచి చైన్నెకు రోడ్డు మార్గం ఉంది. అమరావతి అభివృద్ధికి లక్షకోట్లు అవసరమని, కృష్ణా తీరంలో రాజధాని నిర్మాణం చెపడితే ముంపుకు గురైయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పర్యటక ప్రాంతంగా అభివృద్ది చెందాల్సిన అవసరం ఉంది. ఏ వనరులు ఉన్నాయో పరిశీలించిందని,ఆంధ్రప్రదేశ్ లో 7 జిల్లాలు వెనుకబడి ఉన్నాయని తెలిపారు. కృష్ణా-గోదావరి బేసిన్ లో మాత్రమే వ్యవసాయ ఉత్పత్తి అధికంగా ఉందని, 50 శాతం అగ్రికల్చర్ ఉత్పత్తి కేజీ బేసిన్ ద్వారా ఉందని, ‎తలసరి ఆదాయంలో ఏపీ వెనకబడి ఉందని నివేదికలో పేర్కొన్నట్లు విజయ్ కుమార్ తెలిపారు.  

Tags:    

Similar News