Bhogapuram Airport Trial Run: భోగాపురం ఎయిర్‌పోర్ట్ చరిత్రాత్మక ఘట్టం.. నేడే తొలి వాణిజ్య విమాన ట్రయల్ రన్..!!

Bhogapuram Airport Trial Run: భోగాపురం ఎయిర్‌పోర్ట్ చరిత్రాత్మక ఘట్టం.. నేడే తొలి వాణిజ్య విమాన ట్రయల్ రన్..!!

Update: 2026-01-04 01:30 GMT

Bhogapuram Airport Trial Run: ఆంధ్రప్రదేశ్ విమానయాన చరిత్రలో మరో కీలక మైలురాయి చేరనుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో నేడు తొలి వాణిజ్య విమానం ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ ట్రయల్ రన్ జరగనుండగా, ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానం భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కానుంది.

ఈ ప్రత్యేక విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, అలాగే డీజీసీఏ (DGCA) అధికారులు ప్రయాణించనున్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అవడం, టేకాఫ్ ప్రక్రియ సాఫీగా పూర్తయితే, వాణిజ్య సేవలకు ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు.

ట్రయల్ రన్ విజయవంతమైతే, మే నెల నుంచి రెగ్యులర్ విమాన సర్వీసులు ప్రారంభించే అంశంపై కేంద్ర ప్రభుత్వం, ఎయిర్‌లైన్స్ సంస్థలతో చర్చలు ప్రారంభించనుంది. ఇప్పటికే పలు దేశీయ విమానయాన సంస్థలు భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుంచి సర్వీసులు నడిపేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

మొదటి దశలో ఈ విమానాశ్రయం ద్వారా ఏటా సుమారు 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా ప్రణాళికలు రూపొందించారు. భవిష్యత్తులో అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ప్రారంభించేలా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్ ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి, ఉపాధి అవకాశాలకు, పర్యాటక రంగానికి భారీ ఊతం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ రాష్ట్రానికి గర్వకారణంగా నిలవనుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News