Nimmala Ramanaidu: రాయలసీమ బిడ్డను అని చెప్పుకుంటున్న జగన్ హంద్రీనివాకు ఏమీ చేశారు..?

Nimmala Ramanaidu: మాజీ సీఎం జగన్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. ఐదేళ్లు రాయలసీమ ప్రాజెక్టులను జగన్ నిర్లక్ష్యం చేశారని ఆయన మండిపడ్డారు.

Update: 2026-01-06 09:12 GMT

Nimmala Ramanaidu: మాజీ సీఎం జగన్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. ఐదేళ్లు రాయలసీమ ప్రాజెక్టులను జగన్ నిర్లక్ష్యం చేశారని ఆయన మండిపడ్డారు. పూర్తి కాని ప్రాజెక్టులు జాతికి అంకితం చేసి ప్రజలను మోసగించారని ఆరోపించారు. సినిమా సెట్టింగులతో జగన్ కాలాయపాన చేశారని విమర్శించారు. రాయలసీమ లిఫ్టులపై జగన్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయన్నారు. రాయలసీమ బిడ్డను అని చెప్పుకుంటున్న జగన్ ఐదేళ్లు హంద్రీనివాకు ఏమీ చేశారు..? అంటూ మంత్రి నిమ్మల ప్రశ్నించారు.

Tags:    

Similar News