Vangaveeti Asha Kiran: వంగవీటి కుటుంబం మరోసారి రంగంలోకి.. ఆశాకిరణ్ రాజకీయ అరంగేట్రం
వంగవీటి ఆశాకిరణ్ రాజకీయ అరంగేట్రం వంగవీటి ఫ్యామిలీపై ఏపీ నాయకుల అటెన్షన్ విజయవాడ తూర్పులో వంగవీటికి వీరాభిమానులు రాధా.. రంగా మిత్ర మండలి ఆధ్వర్యంలో ప్రజల్లోకి ఆశాకిరణ్
Vangaveeti Asha Kiran: వంగవీటి కుటుంబం మరోసారి రంగంలోకి.. ఆశాకిరణ్ రాజకీయ అరంగేట్రం
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం అందరి చూపు విజయవాడ తూర్పు నియోజకర్గంపై కేంద్రీకృతమైందట. అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఆ నియోజకవర్గం గురించే చర్చ జరుగుతోందట. అందుకు కారణం లేకపోలేదు. ఇటీవల రాజకీయ అరంగేట్రం చేస్తున్నానని ప్రకటించిన కాపు సామాజికవర్గం హీరో రంగా తనయ ఆశా కిరణ్. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆశా కిరణ్.. MLAగా పోటీ చేస్తే.. తండ్రి, తల్లి, సోదరుడు పోటీ చేసి గెలుపొందిన తూర్పు నియోజకవర్గాన్నే ఎన్నుకుంటారని ప్రచారం. అది కూడా వైసీపీ టికెట్‌పైనే ఆమె బరిలోకి దిగుతారన్న చర్చ జోరుగా సాగుతోంది.