మానవత్వం చాటుకున్న రామ్ మాలిక్ నాయుడు.. గడప వద్దకే వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సేవలలో సరికొత్త ఒరవడిని ప్రదర్శిస్తూ, లబ్ధిదారుల చెంతకే వెళ్లి సాయం అందించారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, యువ నాయకులు కిమిడి రామ్ మాలిక్ నాయుడు.

Update: 2026-03-17 06:06 GMT

మానవత్వం చాటుకున్న రామ్ మాలిక్ నాయుడు.. గడప వద్దకే వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!

గరివిడి, విజయనగరం జిల్లా: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సేవలలో సరికొత్త ఒరవడిని ప్రదర్శిస్తూ, లబ్ధిదారుల చెంతకే వెళ్లి సాయం అందించారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, యువ నాయకులు కిమిడి రామ్ మాలిక్ నాయుడు. చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని గరివిడి మండలంలో సోమవారం ఆయన విస్తృతంగా పర్యటించి, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

29 మందికి రూ. 19.13 లక్షల సాయం:

వివిధ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చికిత్స పొంది, ప్రస్తుతం ఇళ్ల వద్ద కోలుకుంటున్న 29 మంది బాధితులను రామ్ మాలిక్ నాయుడు స్వయంగా పరామర్శించారు. ప్రభుత్వం నుండి మంజూరైన రూ. 19,13,587/- విలువైన చెక్కులను వారి గడప వద్దకే వెళ్లి పంపిణీ చేశారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ, వారికి ధైర్యాన్ని నింపారు.

నాయకుడే ఇంటికి రావడంతో హర్షం:

సాధారణంగా ప్రభుత్వ సాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నాయకుడే నేరుగా ఇంటికి వచ్చి ఆర్థిక భరోసా కల్పించడం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో తమను ఆదుకున్న కూటమి ప్రభుత్వానికి, ప్రత్యేక చొరవ చూపిన రామ్ మాలిక్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్ మరియు బూత్ ఇన్చార్జులు, రైతు సంఘం నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News