CM Chandrababu: గ్యాస్ టెన్షన్ వద్దు.. ఏపీలో 15 రోజులకు సరిపడా నిల్వలు

CM Chandrababu: రాష్ట్రంలో గ్యాస్ సరఫరా మరియు లభ్యతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఆర్టీజీఎస్ (RTGS) వేదికగా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

Update: 2026-03-17 09:19 GMT

CM Chandrababu: గ్యాస్ టెన్షన్ వద్దు.. ఏపీలో 15 రోజులకు సరిపడా నిల్వలు

CM Chandrababu: రాష్ట్రంలో గ్యాస్ సరఫరా మరియు లభ్యతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఆర్టీజీఎస్ (RTGS) వేదికగా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సాయి ప్రసాద్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గెయిల్ (GAIL), ఓఎన్జీసీ (ONGC) ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కొరత లేదు.. అప్రమత్తంగా ఉండాలి:

రాష్ట్రంలో ప్రస్తుతం 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరో 15 రోజులకు సరిపడా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, అదనపు గ్యాస్ కూడా త్వరలో అందుబాటులోకి రాబోతోందని తెలిపారు. ముఖ్యంగా ఆసుపత్రులు, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అక్రమాలకు చెక్.. ప్రత్యామ్నాయాలపై దృష్టి:

గ్యాస్ సిలిండర్ల మళ్లింపును అరికట్టేందుకు ఈకేవైసీ (e-KYC), ఓటీపీ (OTP) విధానాలను పకడ్బందీగా అమలు చేయాలని సీఎం సూచించారు. గ్యాస్ కొరతను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేయాలని, రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్‌ల లభ్యతను పెంచాలని ఆదేశించారు.

పైప్డ్ గ్యాస్ నెట్‌వర్క్ విస్తరణ:

రాష్ట్రంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలని సీఎం ఆకాంక్షించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని కేజీ బేసిన్ (KG Basin) లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువును పైప్డ్ గ్యాస్ (PNG) ద్వారా నేరుగా ప్రజల ఇళ్లకు సరఫరా చేసేలా చర్యలు వేగవంతం చేయాలన్నారు. సీఎన్జీ (CNG), పీఎన్జీల వినియోగాన్ని గరిష్టంగా పెంచే అవకాశాలను పరిశీలించాలని గ్యాస్ కంపెనీల ప్రతినిధులను కోరారు.

Tags:    

Similar News