'భీమవరం' కోడి పందాలు ఉన్నట్లా? లేనట్లా?

Update: 2020-01-13 17:21 GMT
భీమవరం కోడి పందాలు

గత కొన్నిసంవత్సరాలుగా కోడి పందాలు అనేవి దేశవ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది. ముఖ్యంగా ఆంధ్రపద్రేశ్ పెద్ద విషయంగా భావిస్తారు. ఎందుకంటే సంక్రాంతి పండగ రోజు కోడిపందాలను సంప్రదాయంగా భావిస్తారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కోడిపందెలు చూడడానికి భీమవరం వస్తారు. కోడిపందాలు చూడడానికి ప్రత్యేకంగా వచ్చే అతిథిదులు ఉన్నారు.

అయితే ఈ సంవత్సరం సీఎం జగన్ సర్కార్ కోడి పందాలు విషయంలో ఉక్కుపాదం మోపిందని తెలుస్తోంది. ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం గోదవరి జిల్లాలో కోడిపందేలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మూడు రోజులు జరగాల్సిన కోడి పందాల నిలిచిపోయోలా ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పటికే వేలాదిగా భీమవరం చేరుకున్న కోడి పందాలు చూడాలని అనుకున్న వారంతా తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో భీమవరం చూట్టు పక్కల పల్లెల్లో కోడిపందాలు నిర్వహించాలనే పట్టుదలతో కొందరూ ఉన్నారు. కోడి పందాలు నిర్వహిస్తే ఏం జరుగుతోందని భయాందోళలో కొందరు ఉన్నారు. అయితే తమిళనాడు ప్రజలు గతంతో జల్లి కట్టు విషయంతో తీవ్ర ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రపద్రేశ్ ప్రజలు గొడవలు చేసే వారు కాదు. సమస్యలు పరిష్కరించాలనే సాకూలత ఆలోచనతో ఉంటారు. గతంలో వైఎస్ సర్కార్ ఎడ్ల పందాలు నిలిపివేసినప్పుడు ప్రజలు ఎలాంటి ఆందోళనలు చేయలేదు. ఇప్పుడు ఏపీ ప్రజలు ప్రభుత్వానికి కోడిపందాలు నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నప్పటికి ప్రభుత్వ నిర్ణయంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఈ సమయానికి అందుతున్న సమాచారం ప్రకారం మరిన్ని వివరాలు హెచ్ ఎంటీవి లైవ్ లో చూడండి.

 

Tags:    

Similar News