Puttaparthi: కరోనా వైరస్ పై అవగాహన సదస్సు

పట్టణంలో టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ గౌస్ లాజం ఆధ్వర్యంలో కరోనా వైరస్ పై అవగాహన సదస్సు జరిగింది.

Update: 2020-03-18 02:27 GMT
Awareness of coronavirus

పుట్టపర్తి: పట్టణంలో టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ గౌస్ లాజం ఆధ్వర్యంలో కరోనా వైరస్ పై అవగాహన సదస్సు జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజానీకం భయభ్రాంతులకు గురవుతున్న కరోనా వైరస్ నుండి కాపాడుకోవాలంటే మనకు అందుబాటులో ఉండే మాస్కు ధరించాలి అన్నారు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ 1938 ఫెడరేషన్. అయితే ప్రతిరోజు మాస్కు కొనాలంటే ఖర్చుతో కూడుకున్ననందున సులభ పద్ధతిలో తయారు చేసుకునేందుకు విద్యార్థులకు గ్రామీణ ప్రజలకు సులభ ప్రయోగాలతో అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరుణ వైరస్ నివారణ మార్గాలు వ్యక్తిగత, పరిసరాల శుభ్రత చాలా అవసరమన్నారు. చేతులను సబ్బుతో కానీ నీ ద్రవంతో ప్రతి 20 నిమిషాలకు శుభ్రంగా కడుక్కోవాలి అన్నారు.

Tags:    

Similar News