Atchannaidu: సీఈసీకి 4 లేఖలు రాసిన అచ్చెన్నాయుడు

Atchannaidu: ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందికి గురిచేసేలా కీలక స్థానాల్లో.. 42 మంది డీఎస్పీలను నియమించారని అచ్చెన్న ఫిర్యాదు

Update: 2024-02-04 05:14 GMT

Atchannaidu: సీఈసీకి 4 లేఖలు రాసిన అచ్చెన్నాయుడు

Atchannaidu: ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీఈసీకి 4 లేఖలు రాశారు. ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందికి గురిచేసేలా కీలక స్థానాల్లో.. 42 మంది డీఎస్పీలను నియమించారని అచ్చెన్న ఫిర్యాదు చేశారు. సీఎం జగన్‌ సామాజిక వర్గానికి చెందిన 10 మందిని.. టీడీపీ బలంగా ఉన్న స్థానాల్లో నియమించినట్టు లేఖలో పేర్కొన్నారు. ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, తిరుపతి కలెక్టర్‌ లక్ష్మీశను.. ఎన్నికల విధుల నుంచి తొలగించాలని కోరారు. ఇక ఓటర్ జాబితాలో తప్పులను సరిదిద్దాలని మరో లేఖ రాసిన అచ్చెన్న.. ఆయా ఫిర్యాదులపై పేపర్‌ క్లిప్పింగులు, ఆధారాలు జతచేస్తూ.. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు అచ్చెన్నాయుడు.

Tags:    

Similar News