Kurnool: సీఎం పర్యటన ఏర్పాట్లను వేగవంతం చేసిన అధికారులు

రేపు కర్నూలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. నగరంలోని స్థానిక ఎస్టీబిసి కళాశాల మైదానంలో భారీ పబ్లిక్ మీటింగ్ ఏర్పాట్లను అదికారులు పూర్తి చేశారు.

Update: 2020-02-17 11:59 GMT

కర్నూలు: రేపు కర్నూలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. నగరంలోని స్థానిక ఎస్టీబిసి కళాశాల మైదానంలో భారీ పబ్లిక్ మీటింగ్ ఏర్పాట్లను అదికారులు పూర్తి చేశారు. రెపు ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు కర్నూలు లో పర్యటించనున్నారు. గన్నవరం నుండి ఓర్వకల్ ఎయిర్ పోర్టు కు చేరుకొని అక్కడి నుండి ఎలికాఫ్టర్ ద్వార కర్నూలులోని రెండవ ఏపీఎస్పీ బెటాలియన్ కు చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గాన ఎస్టీబిసి కళాశాలలో ఏర్పాటు చేసిన భారి భహిరంగ సభలో పాల్గోంటారు.

భహిరంగ సభలో 3 విడత డా. వైఎస్సార్ కంటి వెలుగు -అవ్వా తాత -లకు కంటి పరీక్షల కార్యక్రమం ప్రారంభోత్సవం, రూ.100 కోట్లతో 402 ఆరోగ్య, వికాస కేంద్రాల నమూనా భవనం పరిశీలన, శంకుస్థాపన శిలా ఫలకం ఆవిష్కరణ, చేస్తారు. అనంతరం భారీ పబ్లిక్ మీటింగ్, 6414 మంది ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు 108 కోట్ల రూపాయల అసెట్స్ పంపిణీ చేస్తారు. జగన్ సి.యం అయినప్పటి నుండి మెదటగా కర్నూలు పర్యట నేపద్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాల ఏర్పాటును, ట్రాఫిక్, భద్రత ఏర్పాట్లను పకడ్బందిగా నిర్వహించామని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News