ఈనెల 17న అరకు వైసీపీ ఎంపీ వివాహం
ఈనెల 17న అరకు వైసీపీ ఎంపీ వివాహం ఈనెల 17న అరకు వైసీపీ ఎంపీ వివాహం
అరకు వైసీపీ ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం ఈనెల 17న జరగనుంది. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్‌తో ఆమెకు నిశ్చితార్థం జరిగిందని ఎంపీ సోదరులు మహేశ్, ప్రసాద్ తెలిపారు. తెల్లవారుజాము 3.15 గంటలకు శరభన్నపాలెంలో వివాహం, విశాఖలో రిసెప్షన్ నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు వైసీపీ అగ్రనేతలు వస్తారని తెలిపారు. కాగా 2019 సాధారణ ఎన్నికల్లో అరకు ఎంపీగా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ పై మాధవి విజయం సాధించిన సంగతి తెలిసిందే.