నెల్లూరు జిల్లా పార్టీ సమీక్షా సమావేశం పూర్తిచేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. నెల్లూరు పార్లమెంటుతో పాటు జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లను నియమించారు. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం ఇన్ ఛార్జ్ గా శ్రీ చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డిని నియమించారు. అసెంబ్లీ నియోజకవర్గాలు.. సూళ్లూరుపేట నియోజకవర్గానికి ఉయ్యాల ప్రవీణ్, సర్వేపల్లికి శ్రీమతి సుంకర హేమలత, ఆత్మకూరు నియోజకవర్గానికి శ్రీ మలిశెట్టి శ్రీధర్,
కావలి నియోజకవర్గానికి శ్రీ అలహరి సుధాకర్, ఉదయగిరి కి శ్రీ వేముల రాజాలను ఇన్ ఛార్జ్ లుగా పవన్ కళ్యాణ్ నియమించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నందున ఇంఛార్జిని ప్రకటించలేదు. కార్యకర్తలతో మరోసారి చర్చించిన తర్వాత ఇన్ ఛార్జ్ ని నియమించాలని పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నట్టు సమాచారం. అంతవరకు మనుక్రాంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోనున్నారు.