ఏపీలో టీడీపీకి మరో దెబ్బ.. బీజేపీలోకి రాయపాటి?

Update: 2019-07-22 06:09 GMT

బీజేపీ ఆకర్ష్ కి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి మరో పెద్ద దెబ్బ తగలనుందా? పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. టీడీపీ గుంటూరు జిల్లా నేత రాయపాటి సాంబశివరావు కొంత కాలంగా పార్టీతో ఎడమొఖం..పెడమొఖం గా ఉంటూ వస్తున్నారు. నిజానికి ఎన్నికల ముందునుంచే ఆయన టీడీపీలో అసంతృప్తితోనే ఉన్నారని చెప్పాలి. ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తామనే హామీతోనే తెలుగుదేశంలోకి రాయపాటి వచ్చారు. అయితే, ఆ పదవిని పుట్టాసుధాకర్ యాదవ్ కి అప్పచెప్పారు చంద్రబాబు. దీంతో అప్పట్నుంచీ రాయపాటి టీడీపీతో అంటీ ముట్టనట్టుగానే వ్యవహరించారు. ఇప్పడు ఏపీలో టీడీపీ పరిస్థితి ఏమీ బాగోలేదు. ఈ నేపథ్యంలో చాలా కాలం నుంచి రాయపాటి పార్టీ మారుతున్నారంటూ వదంతులు వస్తున్నాయి. అయితే, ఈరోజు ఆ వదంతులకు ఆయన తెరదించారు. తిరుమల వెంకన్నను దర్శించుకోవడానికి వచ్చిన అయన దర్శనానంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజకీయాలు మాట్లాడను అంటూనే.. పార్టీ మారే ఆలోచన ఉందని స్పష్టం చేశారు. అయితే, బీజేపీ లోకి వెళతారని ప్రచారం జరుగుతోంది నిజమేనా? అని అడిగిన ప్రశ్నకు అయన, ఇంకా వాళ్ళతో మాట్లాడలేదని జవాబిచ్చారు. పార్టీ మారే ఆలోచన ఉందనీ, త్వరలోనే వివరాలు చెబుతాననీ రాయపాటి వివరించారు. 

Tags:    

Similar News