శాసనమండలి రద్దు చేసినట్లే అసెంబ్లీని రద్దు చేయండి : చంద్రబాబు

శాసనమండలి రద్దు చేసినట్లు అసెంబ్లీని కూడా రద్దు చేయాని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Update: 2020-01-27 14:57 GMT
Chandra Babu File Photo

శాసనమండలి రద్దు చేసినట్లు అసెంబ్లీని కూడా రద్దు చేయాని చంద్రబాబు డిమాండ్ చేశారు.అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు ఎదుర్కొవడానికి టీడీపీ సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రజలు ఎవరితో ఉన్నారో తేలిపోతుందని, ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటామని అన్నారు. అమరావతిపై రేఫరెండం పెట్టాలని కోరారు. అమరావతి రాజధాని కావాలని ప్రజలు కోరితే వైసీపీ ప్రభుత్వం తప్పుకోవాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానులు ప్రజలు ఓప్పుకోవడంలేదని చంద్రబాబు తెలిపారు. అన్ని రాజకీయ సంఘాలు వ్యతిరేకిస్తు్న్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లాలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు రాష్ట్రం కోసం త్యాగం చేశారని చంద్రబాబు తెలిపారు.

ఓటింగ్ సమయంలోనూ నాటకాలు ఆడారని ఆరోపించారు. అసెంబ్లీలో 121మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి మండలి రద్దు తీర్మానానికి 133 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఉన్నారని ప్రకటించడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని వైసీపీ నాటకాలు అడుతుందని మండిపడ్డారు. మండలిలో టీడీపీ ఎమ్మెల్సీలకు వైసీపీ ఆశలు చూపించిందని ఒక్కరు కూడా డబ్బుకు ఆశపడలేదని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ అంసెబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ అమోదింస్తూ సంచన నిర్ణయం తీసుకుంది. మండలి రద్దుపై తీర్మానం సీఎం జగన్ శాసనసభలో ఉదయం తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం సభలో దీనిపై సభ్యులు చర్చించారు. స్పీకర్ తమ్మినేని సీతారమ్ ఓటింగ్ నిర్వహించారు. మండలి రద్దుకు అనుకూలంగా 133 ఓట్లు ఉన్నట్లు తేల్చారు. వ్యతిరేకంగా ఎవరూ లేరని స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.రాజ్యాంగంలోని 169 రూల్ ప్రకారం మండలి రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం శాసన మండలి రద్దు తీర్మానం ఆమోదం పొందినట్లు స్పికర్ ప్రకటించారు. అనంతరం శాసనసభను నిరవధిక వాయిదా వేశారు. మండలి రద్దుకు అసెంబ్లీ ఆమోదించిన ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది. పార్లమెంట్‌ లోనూ, రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తరువాత సభ పూర్తిగా రద్దు కానుంది. 

Tags:    

Similar News