చంద్రబాబు చేయలేనిది జగన్ సాధ్యం చేశారు : మంత్రి పేర్నినాని
చంద్రబాబు ఆర్టీసీ విలీనం అసాధ్యమన్నారని, సీఎం వైఎస్ జగన్ సాధ్యం చేసి చూపించారని తెలిపారు
జర్నలిస్టులపై దాడి జరిగితే చంద్రబాబు, నారా లోకేష్ సమర్థించడం దారుణమన్నారు. రైతు ఆందోళన శాంతియుతంగా ఉంటుందని, రాజధానిలో ఆందోళన చేసేవారి ఎవరు రెచ్చకొతున్నారి అందరికీ తెలుసు అని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని దుయ్యాబట్టారు. చంద్రబాబు ఆర్టీసీ విలీనం అసాధ్యమన్నారని, సీఎం వైఎస్ జగన్ సాధ్యం చేసి చూపించారని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే.. 8309887955 వాట్సాప్ ఫిర్యాదు చేయాలన్నారు. రోజువారీ ఆర్టీసీ సర్వీసు పైసా కూడా పెంచలేదని, స్పెషల్ సర్వీసుల్లో మాత్రమే 50 శాతం పెరిగాయని చెప్పారు. 2020 జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిపు పొందుతారని వెల్లడించారు.
జర్నలిస్టు యూనియన్లు తీరును మంత్రి పేర్ని నాని తప్పుబట్టారు. అమరావతిలో మీడియా ప్రతినిధులపై దాడి జరిగితే ఖండించకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంలో జర్నలిస్ట్ యూనియన్లు ఏం చేస్తున్నాయని నిలదీశారు. అక్రిడేషన్ కార్డుల కోసం పోటీపడే జర్నలిస్ట్ యూనియన్లు తన తోటి మీడియా ప్రతినిధులపై దాడి జరిగితే ఏమయ్యాయని ప్రశ్నించారు. దాడిలో గాయపడ్డ వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు.