Gummidi Sandhyarani: ఏపీలో 5,000 మినీ అంగన్వాడీల అప్‌గ్రేడ్

Gummidi Sandhyarani: ఆంధ్రప్రదేశ్‌లో మహిళా, శిశు సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2025-11-24 09:50 GMT

Gummidi Sandhyarani: ఆంధ్రప్రదేశ్‌లో మహిళా, శిశు సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ఏపీ మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రకటించారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏకంగా 217 మందికి అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అంగన్వాడీ ఉద్యోగుల జీవితాల్లో ఆనందం నింపినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పిల్లల పోషణ, ఆరోగ్యం, ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ సేవలను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ సేవలను మరింత విస్తృతం చేయడానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.

Tags:    

Similar News